గర్ల్ ఫ్రెండ్‌కు శ్రీశాంత్ ఫోన్ కొన్నాడు: కస్టడీకి విందూ

శ్రీశాంత్, చవాన్, చండిలలను మరో ఐదు రోజుల పాటు తమ కస్డడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను ఆయన తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. స్పాట్ ఫిక్సింగ్ ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని వారు చెప్పారు. శ్రీశాంత్ మేనేజర్ నుంచి పది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని కూడా పోలీసులు తెలిపారు.
ముంబైతో ఈ నెల 15వ తేదీన రాజస్థాన్ రాయల్స్ మ్యాచు జరగనున్న నేపథ్యంలో శ్రీశాంత్ ఒకే రోజు 1.9 లక్షలు పెట్టి దుస్తులు కొన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని ఆయన నగదు రూపంలోనే చెల్లించాడని, గర్ల్ ఫ్రెండ్ కోసం బ్లాక్‌బెర్రీ ఫోన్ కొన్నాడని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ సొమ్మును అందుకు ఉపయోగించాడని అన్నారు శ్రీశాంత్‌పై పోలీసులు 409 సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేశారు.
తాము విందూతో పాటు హవాలా ఆపరేటర్ అల్పేష్ పటేల్‌ను, ప్రేమ్ తనేజాను అరెస్టు చేసినట్లు ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ హిమాంశు రాయ్ చెప్పారు. అల్పేష్ పటేల్ ఇంటిలోంచి 1.28 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీశాంత్ నీలం రంగు టీ షర్ట్ ధరించాడు.
కోర్టుకు వచ్చిన అంకిత్ చవాన్ ఎవరితోనూ మాట్లాడలేదు. చండిలా తనకు తెలిసినవారితో కోర్టులో మాట్లాడాడు. అంకిత్ చవాన్ నీలం రంగు చొక్కా ధరించగా, చండిల ఆకుపచ్చ చొక్కా ధరించాడు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు చేసిన సినీ నటుడు, దారా సింగ్ కుమారుడు విందూను పోలీసులు ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. విందూను కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు కోర్టు పోలీసు కస్డడీకి అప్పగించింది. అంతకు ముందు పోలీసులు విందూ దారాసింగ్‌ను విచారించారు. ముంబై పోలీసులు గత వారం అరెస్టు చేసిన బుక్కీ రమేష్ వ్యాస్ విందూ పేరు చెప్పినట్లు తెలుస్తోంది.
రమేష్ వ్యాస్‌కు భారతదేశంలోని బుక్కీలకు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సునీల్ దుబాయ్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. విందూకు బలమైన బుక్కీలతో పరిచయాలున్నాయని రమేష్ వ్యాస్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై 19 మందిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications