Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలీవుడ్: యాక్టర్ విందూ అరెస్ట్, నటనపై శ్రీశాంత్ ఆసక్తి

Vindoo Dara Singh
ముంబయి: ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు మంగళవారం మరొకరిని అరెస్టు చేశారు. విందూ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విందూ పలు సీరియళ్లు, సినిమాలలో నటించాడు. విందూ అరెస్టు ద్వారా బాలీవుడ్‌కు స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

విందూ మాఫియాతో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇతను ప్రముఖ నటుడు దారా సింగ్ తనయుడు. విందూ అరెస్టు నేపథ్యంలో మరిన్ని బాలీవుడ్ లింక్స్ పైన పోలీసులు దృష్టి సారించారు. ప్రముఖ రెజ్లర్‌గా ఇతను పేరు పొందాడు. విందూ బిగ్ బాస్ విజేత కూడా.

ఇటీవల రమేష్ వ్యాస్‌ను పోలీసులు స్పాట్ బెట్టింగ్ అంశంపై అరెస్టు చేశారు. రమేష్ చెప్పిన ఆధారాలతో విందూను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అరెస్టు సమయంలో విందూను పోలీసులు ప్రశ్నించారు. టివిలో వస్తున్న వార్తల ప్రకారం.. బుకీలతో విందూకు లింక్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా కొన్ని మ్యాచులలో విందూ సాక్షి పక్కనే కనిపించారు. అయితే, ఈ విషయం సాక్షికి తెలియదు. ఆమె ఎప్పటిలాగే మ్యాచ్ చూశారు.

జైపూర్‌కు శ్రీశాంత్!

స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలతో అరెస్టైన పేసర్ శ్రీశాంత్‌ను ఢిల్లీ పోలీసులు జైపూర్‌కు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిన రికవరీ కోసం శ్రీశాంత్‌ను జైపూర్‌కు తీసుకు వెళ్లిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తిరిగి తీసుకు వచ్చారు.

శ్రీశాంత్ లాప్‌టాప్ పరిశీలించిన పోలీసులకు పలు విషయాలు తెలిసినట్లుగా సమాచారం. శ్రీశాంత్‌కు బాలీవుడ్ నటులు, నిర్మాతలతో సంబంధాలు ఉన్నట్లుగా లాప్‌టాప్ ద్వారా తెలిసింది. అతను సినిమాలలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడని, హిందీ, మలయాళం సినిమాలలో నటించాలని అనుకున్నాడని, తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనేది శ్రీశాంత్ ఆశ అని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఈ కారణంగానే అతను హిందీ, మలయాళ చిత్ర ప్రముఖులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని తెలిసింది. పెద్ద మల్టీస్టారర్ సినిమాను నిర్మించి అందులో తను నటించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+