14వ భార్యగా?: బ్రిటన్‌ను అశ్రయించిన మహిళ

 14th wife? Woman rebuffs Swaziland king
లండన్: ఆఫ్రికా దేశమైన స్వాజీలాండ్ రాజు మిస్వాతి-3 నుంచి తనకు రక్షణ కల్పించాలని 22 ఏళ్ల మహిళ బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. మిస్వాతి తనను చెరపట్టుకుండా కాపాడి తనకు ఆశ్రయం కల్పించాలని కోరింది. ఇప్పటికే 13 మంది భార్యలు, 27 మంది పిల్లలు ఉన్న 45 ఏళ్ల వయసున్న కింగ్ మిస్వాతి-3 ఇప్పుడు తనను 14వ భార్యగా చేసుకోవాలని చూస్తున్నాడంటూ టిన్‌ట్స్‌వాలో ఎన్‌గోబేనీ అనే మహిళ బ్రిటన్ ప్రభుత్వ శరణుగోరింది.

తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు రాజప్రసాదంలోకి తాను తొలిసారి అడుగుపెట్టానని చెప్పింది. అప్పటి నుంచే తనను రాజకుటుంబంలో భాగం కావాల్సిందిగా కోరుతున్నట్లు వివరించింది. కాగా, మిస్వాతి పెట్టే ఇబ్బందులు తాళలేక అతడి ఆరో భార్య నిరుడు రాజ కుటుంబం నుంచి పారిపోయింది. ప్రతి ఏటా కొత్త భార్యను మనువాడి రాజప్రసాదంలోకి తీసుకురావడం ఈ రాజు సంప్రదాయంగా పెట్టుకున్నాడు.

కొందరు యువతులను తన ప్యాలెస్‌లోకి ఆహ్వానించే రాజు వారితో అర్ధనగ్నంగా నృత్యాలు చేయించి వారిలో తనకు నచ్చిన యువతులను మనువాడతాడు. తన భార్యలందరినీ బాహ్యప్రపంచానికి దూరంగా ఉంచే మిస్వాతి వారిని సంవత్సరానికి ఒకసారి అమెరికా పంపిస్తాడు.

తనను పెళ్లి చేసుకోవాలని స్వాజీలాండ్ రాజు అనుకుంటున్నాడని తెలిసినప్పుడు తాను భయపడిపోయానని ఆ మహిళ చెప్పింది. ఎన్‌కోబెనీ అనే యువతి భయపడి తాను పారిపోయి వచ్చినట్లు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+