కడియంపై కొత్తకోట సంచలనం: టిడిపిలోకి మంత్రి బ్రదర్

Kadiyam Srihari - Kottakota Dayakar Reddy
హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మక్తల్ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మంగళవారం మినీ మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో తాను కలుసుకున్నప్పుడు కడియం శ్రీహరితో టచ్‌లో ఉండాలని చెప్పారని, దాని మర్మమేమిటో తనకు అప్పుడు అర్థం కాలేదన్నారు.

ఈ విషయాన్ని తాను అప్పుడే కడియం శ్రీహరి వద్ద ప్రస్తావిస్తే.. కడియం తన భుజంపై చేయి వేసి కెసిఆర్ అలా అన్నారా? అని వ్యాఖ్యానించారని చెప్పారు. ఇప్పుడు కడియం శ్రీహరి తెరాసలో చేరిపోయారన్నారు. టిడిపిని వీడితున్న నేతలపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే కడియం శ్రీహరి గురించి మాత్రం పై విధంగా చెప్పడం చర్చనీయాంశమైంది.

టిడిపిలోకి మంత్రి సోదరుడు, చాడ

హన్మకొండ- మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి మంగళవారం తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మొదట టిడిపిలో ఉన్న ఆయన కొంతకాలం క్రితం తెరాసలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ టిడిపిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. జూన్ మొదటి వారంలో ఆయన టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

కడప జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా సోదరుడు ఇనయతుల్లా కూడా చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలోకి బిజెపికి చెందిన మురళి, ఓయు జెఏసి నేత రాజారామ్ యాదవ్ తదితరులు కూడా త్వరలో రానున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+