హైదరాబాద్ మ్యాచ్‌కు చండిలకు రూ. 15 లక్షలు

చండిలకు ఏప్రిల్‌లోనే బుక్కీల నుంచి డబ్బులు అందాయని, అజిత్ చండిల క్రికెట్ కిట్ నుంచి 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. బాబూరావు సాయంతో ఐసియల్ మ్యాచుల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సునీల్ భాటియా అంగీకరించినట్లు వారు తెలిపారు. ఐసియల్ ఆటగాళ్లపై నిషేధం తర్వాత సునీల్ భాటియా బాబూరావును బంగ్లాదేశ్ తీసుకుని వెళ్లాడని, భాటియాకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ ఆటగాడితో సంబంధాలున్నాయని వారు చెప్పారు.
బుక్కీలు పవన్ జైపూర్, సంజయ్ జైపూర్ దుబాయ్ పారిపోవడానికి తాను సహాయం చేసినట్లు నటుడు వీందూ దారా సింగ్ అంగీకరించినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. విందూ నివాసంలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. పవన్ జైపూర్‌కు చెందిన మూడు మొబైల్ ఫోన్లను, విందూ ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంజయ్, పవన్ విందూ కారులోనే హోటల్ నుంచి విమానాశ్రయానికి వెళ్లారు. బెట్టింగులో విందూ 17 లక్షల రూపాయల దాకా గెలుచుకున్నట్లు, అయితే ఆ సొమ్ము తన చేతికి రాలేదని విందూ చెప్పినట్లు తెలుస్తోంది. ఆనంద్ అనే బుక్కీ ద్వారా తాను ఇందులోకి అడుగుపెట్టినట్లు విందూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
తన భర్త అమాయకుడని, ఆయన ఏ తప్పూ చేయలేదని, కొంత మందితో స్నేహం చేసి ఉండవచ్చు గానీ తప్పు చేయలేదని విందూ భార్య దీనా ఉమ్రావా ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో అన్నారు.












Click it and Unblock the Notifications