ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా సినిమా, క్రికెట్ తర్వాత ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రీతి ప్రకటనల మోడల్ నుండి సినిమాల్లోకి వచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితం ఐపిఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని అయ్యారు.

ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావాలని ఉబలాటపడుతున్నారట. తన రాజకీయ ఆరంగేట్ర కోరికను ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దేశంలో మార్పు తెచ్చేందుకు ఏదో ఒక రోజు రాకీయాల్లోకి వచ్చి ఓటెయ్యండని ప్రజల ముందుకు వస్తానని చెప్పింది. యూటివీ స్టార్ టెలివిజన్‌లో స్టార్ స్పీక్ అనే కార్యక్రమంలో ముచ్చటిస్తూ తన మనసులోని మాటను చెప్పింది.

రాజకీయాల్లో ప్రవేశించి గ్లామరస్ పొలిటిషియన్‌గా మారుతానని, అందుకు తగిన విధంగా తనకు అందమైన జట్టు, ప్రజలను ఆకట్టుకునే విధంగా వస్త్రాలంకరణ రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తాయని ప్రీతి జింటా అంటున్నారు. జీవించడానికి ఓ పరిమితి ఉండాలని ఆమె పాఠాలు చెప్పే ప్రయత్నం చేసింది.

ఎంత సంపాదించినా ఏం చేసుకుంటామని, ఆకలి కోసం బిస్కట్లు తింటాం గానీ బంగారు బిస్కట్లు తినం కదా అని అంటోంది. దేశంలో ఎందరో మంచి రాజకీయ నాయకులు ఉన్నారని, వారందరూ అవినీతిలో కూరుకుపోయారని అంటోంది. రాజకీయాల్లోకి రావాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారట. ఆమె కేవలం ఆషామాషీగా అనలేదని సీరియస్‌గా ఉన్నారంటున్నారు.

 ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

దేశంలో ఇటీవలి సంఘటనలు తనను బాధిస్తున్నాయని, రాజకీయాల్లోకి వచ్చి మంచి మార్పు తీసుకు రావాలని ప్రీతి జింటా చెబుతోంది.

 ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

దేశాన్ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తానంటోంది.

 ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

అవినీతితో ప్రజలు విసిగిపోయారని, తాను ఎలాంటి అవినీతిలో కూరుకుపోనని, ప్రజల ముందుకు ఏదో ఒకరోజు వస్తానంటోంది.

 ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

భారత్‌లో ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఉందని, పేద ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది తనను బాధిస్తోందని ప్రీతి అంటోంది.

 ఆషామాషీగా కాదు: ప్రీతిజింటా సీరియస్‌గానే!(పిక్చర్స్)

రాజకీయాల్లోకి వచ్చి గ్లామరస్ పొలిటిషియన్‌గా మారుతానని అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+