అహ్లాద వాతావరణంలో సంజయ్ దత్: ఖైదీ నెం. 16656

Sanjay Dutt
పుణే: 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.

సంజయ్ దత్ ఈ జైలులో మరో మూడున్నర సంవత్సరాలు గడపాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఒక నెల రోజుల పాటు ఆయనకు ఇంటి భోజనం అందుతుంది. పుణేలోని ఆయన స్నేహితుడి ఇంటి నుండి భోజనం పంపిస్తారు. 2007లో ఇదే జైలుకు సంజయ్ దత్ వచ్చారు. అప్పుడు సంవత్సరంన్నర పాటు ఇదే జైలులో సంజయ్ ఉన్నాడు.

కాగా సంజయ్ దత్‌ను ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి గత రాత్రి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్ వారం రోజుల క్రితం లొంగిపోయాడు. పూణేలోని యెరవాడ జైలులో సంజయ్ దత్ గతంలో రెండుసార్లు ఉన్నాడు. అయితే, గతంలో అతను విచారణ ఖైదీగా ఈ జైలులో గడిపాడు. ఈ దోషిగా జైలు జీవితం గడపాల్సి ఉంది.

ఇంటి నుంచి తెచ్చే భోజనానికి, చాపకు, దిండుకు, మందులకు కోర్టు సంజయ్ దత్‌కు అనుమతి ఇచ్చింది. జైలులో ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడానికి మాత్రం కోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఎరవాడ జైలులో సంజయ్ దత్ వడ్రంగి పని చేశాడు. జైలు క్యాంటిన్ నుంచి అవసరమైనవాటిని కొనుక్కోవడానికి ఇంటి నుంచి 1500 రూపాయలు పొందడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+