అమ్మాయిలపై అత్యాచారం: కాశ్మీర్‌లో స్వామీ అరెస్టు

సయ్యద్ గుల్జార్‌గా పిలిచే గుల్జార్ భట్ మత అధ్యయనంలో బాలికలకు స్వల్పకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఆశ్రమ సంస్థను నడుపుతున్నాడు. టీవీ చానెళ్లలో, స్థానిక పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇస్తూ తనకు తాను ప్రచారం కల్పించుకుంటూ వస్తున్నాడు.
ఓ అమ్మాయితో లైంగిక కార్యం నెరుపుతున్నప్పుడు గుల్జార్ శిష్యుడు ఇంతియాజ్ అహ్మద్ సోఫీ చూడడంతో కుంభకోణం వెలుగు చూసింది. బుద్గాం సబ్ జడ్జి కోర్టులో నలుగురుర అమ్మాయిలు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, ఆ వాంగ్మూలాల మేరకు గుల్జార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుల్జార్ ఆశ్రమంలో 500 మంది బాలికలు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
పవిత్రులను చేస్తాననే నమ్మబలికి బాలికలతో అతను లైంగిక క్రీడ సాగించేవాడని, తనను సంతోషపెట్టడానికి బాలికలను సముఖం చేసేందుకు కొంతమంది మహిళలను కూడా నియమించుకున్నాడని పోలీసులు చెప్పారు. తాము గుల్జార్ అనుచరులు అబ్దుల్ గనీ గనాయ్, బషీర్ అహ్మద్ మీర్‌లో కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ ఉత్తమ్ చంద్ చెప్పారు. గుల్జార్‌ను 15 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించినట్లు ఖాన్ సాహిబ్ డిఎస్పీ బషీర్ అహ్మద్ చెప్పారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, వైద్య పరీక్షల్లో ఆరోపణలు నిజమేనని తేలిందని చెప్పారు.












Click it and Unblock the Notifications