స్పాట్ ఫిక్సింగ్: సినిమాలో శ్రీశాంత్ గెస్ట్ రోల్ కట్

మఝవిల్లినట్టం వారే పేరుతో ప్రముఖ మలయాళీ కవి, సంగీతదర్శకుడు కైతప్రం దామోదరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో శ్రీశాంత్ నటించిన దృశ్యాలను తొలగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
వ్యక్తిగతంగా తాను శ్రీశాంత్‌కు వ్యతిరేకిని కానని, మన దేశంలో అత్యుత్తమ ఫాస్ బౌలర్ శ్రీశాంత్ అని, తనకు మంచి మిత్రుడని, ప్రతికూల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశాంత్ నటించిన దృశ్యాలను తొలగిస్తున్నామని దామోదరన్ చెప్పారు.
చిత్రం షూటింగు పూర్తయింది. సెప్టెంబర్‌లో ఓనం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ చిత్రంలో లండన్‌కు చెందిన పాపులర్ పాకిస్తానీ మ్యుజిషియన్ అబ్బాస్ హసన్, హీరోయిన్‌గా అర్చా కవి నటించారు. సినిమాలో మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మానీ నిర్వహించే శిక్షణా శిబిరంలో శ్రీశాంత్ కనిపిస్తాడు.












Click it and Unblock the Notifications