వడదెబ్బ: బస్సులోనే మృతి, పిట్టల్లా రాలుతున్నారు

శనివారం మధ్యాహ్నానికే మృతుల సంఖ్య రాష్ట్రంలో 82కు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. గుంటూరులో 18 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, నల్లగొండ జిల్లాలో ఆరుగురు మరణించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురేసి మరణించారు.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నలుగురేసి, పశ్చిమ గోదావరి, మెదక్, మహబూబ్‌నగర్, కడప జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. శ్రీకాకుళం, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఇద్దరేసి మృత్యువాత పడ్డారు. ఖమ్మం, అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం, అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు.
మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతానికి మృతుల సంఖ్య 117కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల పాట రాష్ట్రంలో వడగాలులు ఇలాగే వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. వడగాలుల ప్రభావం తెలంగామ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. భారతదేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.












Click it and Unblock the Notifications