చివరకు మిగిలేది: మహానాడులో జగన్!, యువ హోరు

YS Jagan - Srilaxmi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు, రేపు మహానాడు జరుగనుంది. ఈ నేపథ్యంలో టిడిపి స్వర్గీయ నందమూరి తారక రామారావు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తదితర ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జగన్, శ్రీలక్ష్మి తదితరుల ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు.

అయితే అవినీతికి పాల్పడితే జైలే గతి అనే అర్థం వచ్చే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు ఫోటోలను ఏర్పాటు చేసిన తెలుగు తమ్ముళ్లు... జగన్‌ను జైలులో ఉంచినట్లుగా ఉన్న ఫోటోలో చివరకు మిగిలేది... చిప్పకూడు అని రాశారు. మరో దాంట్లో శ్రీలక్ష్మి, నిమ్మగడ్డ ప్రసాద్ ఫోటోలను ఏర్పాటు చేసి నమ్ముకున్నోళ్లకు నమ్ముకున్నంత అని రాశారు. దాడి వీరభద్ర రావు లాంటి నేతల ఫోటోలను ఏర్పాటు చేసి జాతికి ఇలాంటి సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇవి తెలుగు తమ్ముళ్లను ఆకట్టుకుంటున్నాయి.

మహానాడును ప్రారంభించిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

యువత హోరు

ప్రస్తుత టిడిపి మహానాడులో యువ హవా ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, శ్రీకాకుళం జిల్లాకు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన నాయుడు, చింతకాయల విజయ్, దేవినేని చంద్రశేఖర్, రితేష్ రాథోడ్, కరణం వెంకటేష్, సిద్దార్థ రెడ్డి, వీరేంద్ర గౌడ్, ఇటీవలే పార్టీలో చేరిన ఓయు జెఏసి నేత రాజారామ్ యాదవ్ వంటి యువకులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. యువనేతలంతా ఒకే గ్యాలరీలో లోకేష్ వద్ద కూర్చున్నారు. వచ్చే ఎన్నికలలో ఎక్కువ మంది యువతకు టిడిపి టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+