టిడిపిలోకి పవన్ కళ్యాణ్ పుకార్లే: చిరు వర్గ మంత్రి సిఆర్

Pawan Kalyan
తిరుపతి: కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య ప్రతిస్పందించారు. గత నాలుగైదు రోజులుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో, కొన్ని సైట్లలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారని, పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయంపై సి. రామచంద్రయ్య సోమవారం ప్రతిస్పందించారు.

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన అన్నారు సోమవారం తిరుమల వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ తెదేపాలో చేరే ప్రసక్తే లేదని సి. రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని రామచంద్రయ్య అన్నారు.

పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగడం పరిపాటి అయింది. అటువంటి పుకార్లకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న విషయంపై కూడా ఆయన మాట్లాడలేదు. వివరణ ఇచ్చిన సి. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవిని రామచంద్రయ్య ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.

తిరుచానూరు గ్రామాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోకి తీసుకొచ్చి ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రకటించే విషయంలో స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తామని రామచంద్రయ్య అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వచ్చాక అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, స్థానికులను గ్రామం నుంచి తొలగించబోమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+