ఎందుకిలా చేశావ్: శ్రీశాంత్‌ని కలిసిన 12 ఏళ్ల ఫ్యాన్

ప్రారంభంలో కోర్టు హాల్‌లో శ్రీశాంత్ కంట పడడానికి తుషార్ చాలా ప్రయత్నం చేశాడు. చివరకు శ్రీశాంత్ కంట పడ్డాడు. ఏమిటని ప్రశ్నించి, తుషార్‌తో శ్రీశాంత్ కరచాలనం చేశాడు. తుషార్ ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్లో ఎనిమిడో గ్రేడ్ చదువుతున్నాడు.
"క్యా యార్, స్పాట్ ఫిక్సింగ్ క్యోం కియా (స్పాట్ ఫిక్సింగ్ ఎందుకు చేశావు)" అని తుషార్ శ్రీశాంత్‌ను గుసగుసగా అడిగాడు. "యార్, మైనే నహీ కియా (నేను చేయలేదు)" అని శ్రీశాంత్ జవాబిచ్చాడు. అయితే, దాంతో సంతృప్తి చెందని తుషార్ శ్రీశాంత్‌ను ప్రశ్నలు వేయడం మానలేదు. కోర్టు విచారణ ముగుస్తున్న సమయంలో తుషార్ మీడియా ప్రతినిధుల నుంచి చిన్న కాగితం ముక్క తీసుకుని శ్రీశాంత్ ఆటోగ్రాఫ్ అడిగాడు.
పోలీసు కస్టడీలో ఉన్నందున ఆటోగ్రాఫ్ ఇవ్వకూడదని శ్రీశాంత్ చెప్పాడు. తుషార్ పట్టుబట్టడంతో కాగితం ముక్క తీసుకుని దానిపై "డియర్ తుషార్.. ప్లీజ్ డూ ప్రే ఫర్ మీ (డియర్ తుషార్.. నా కోసం ప్రార్థించు)" అని రాసి శ్రీశాంత్ సంతకం చేశాడు.
శ్రీశాంత్‌కు మరో రెండు రోజులు పోలీసు కస్టడీ
శ్రీశాంత్, అజిత్ చండిల, మరో ఇద్దరు బుకీలను మరో రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీశాంత్, చండిల, బుక్కీలు చంద్రేష్ పటేల్, అశ్వినీ అలియాస్
టిప్పులను ఈ నెల 28వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మోట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుజ్ అగర్వాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications