గాయం: మీడియాను ఆడిపోసుకున్న శ్రీనివాసన్

తాను మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పానని, తాను రాజీనామా చేయడానికి తగిన కారణమేదీ లేదని ఆయన అన్నారు. విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని అడిగారు.
తాను రాజీనామా చేయబోనని శ్రీనివాసన్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదని, బిసిసిఐలో తనపై తిరుగుబాటు తలెత్తబోదని ఆయన అన్నారు. తనకు పూర్తి మద్దతు ఉందని, బిసిసిఐలో ఒక్కరు కూడా తన రాజీనామాను డిమాండ్ చేయలేదని ఆయన చెప్పారు.
విచారణలో తన ప్రమేయం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు. భయంతో గానీ పక్షపాతంతో గానీ వ్యవహరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పులు ఉన్నట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసన్ చెప్పారు.












Click it and Unblock the Notifications