బాబు 'బ్లూఫిల్మ్'కు గట్టు కౌంటర్, విజయమ్మకు విహెచ్

కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు తాము మళ్లీ గెలువలేమనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జూన్ 8న సన్మానం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏం చూసి పదవి ఇచ్చారన్నారు. బిసిలకు పదవి ఇస్తే స్థాయి దానంతట అదే వస్తుందన్నారు. బిసిలను ఇక కాంగ్రెసు వైపు మళ్లించడమే తమ లక్ష్యమన్నారు.
కార్యకర్తలతో వివేక్ భేటీ
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ కార్యకర్తలతో ఈ రోజు భేటీ అయ్యారు. తెరాసలో చేరికపై కార్యకర్తలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనట్లుగా తెలుస్తోంది.
బాబు బ్లూఫిల్మ్ వ్యాఖ్యలకు గట్టు కౌంటర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన బ్లూఫిల్మ్ వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు ఘాటుగా స్పందించారు. బ్లూ ఫిల్మ్స్ బాబు ఇంట్లో తయారవుతున్నాయా అని ప్రశ్నించారు. వాటినే జైళ్లకు సరఫరా చేస్తున్నట్లుగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తిట్టడమే మహానాడును ఏర్పాటు చేసినట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications