వైయస్ 'జె' టెండర్స్: తుమ్మల, కడియంపై మోత్కుపల్లి

రాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, డిఫ్యూటీ స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ పార్టీకి ఓట్లు వేసిన సన్నాసులకు తమను అనే నైతిక హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. 1983-89 వరకూ తెలుగుదేశం పార్టీ రామరాజ్యం అందించిందని, 1995 నుంచి అభివృద్ధి రాజ్యాన్ని చూపించిందని, గుజరాత్ కంటే ముందే దేశమంతా అబ్బురపడేలా, అనుకరించేలా అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని, నీతి నిజాయతీలతో పాలించామన్నారు.
టెండర్లలో అక్రమాలను నివారించడానికి ఇ-టెండర్లు టిడిపి ఈ-టెండర్లు పెడితే, వైయస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఇ-టెండర్లు పోయి జె-టెండర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. జగన్ ఎవరి పేరు చెబితే వారికే టెండర్లన్నారు. ఎంత నిజాయతీగా పాలించినా కరువును అవకాశంగా తీసుకొని మాపై దుష్ప్రచారం చేశారని, తెలుగుదేశం పాలన సమయంలో రాష్ట్ర ప్రజలు దేశంలో తల ఎత్తుకొని నిలబడగలిగేవారన్నారు. వైయస్ సమయంలో తల దించుకొని నిలబడ్డారన్నారు.
ముఖ్యమంత్రి పదవి మీద ఆశతోనే కడియం శ్రీహరి తెరాసలో చేరారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. "దొంగ కుల సర్టిఫికేట్‌తో ఇంతకాలం టిడిపిని మోసం చేశారు. ఆ నియోజకవర్గం ప్రజలను మోసగించారు. ఆయన మాల కాదు.. మాదిగ కాదు. మరీ ఏ కులమో కడియమే చెప్పాలి. దీనిపై నేను అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాన''ని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ కోసం లేఖ రాస్తే టిడిపి కార్యాలయం వద్ధ అటెండరు పని చేస్తానని చెప్పినా హరీశ్ రావు ఇప్పుడేమీ చేస్తున్నారని ప్రశ్నించారు. టిడిపిని దెబ్బతీయడానికి కాంగ్రెస్‌తో కెసిఆర్ కుమ్మక్కయ్యారన్న ఆయన.. అందుకే సోనియాని విమర్శించడం లేదని మండిపడ్డారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications