వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను టిడిపికా..?: నవ్వేసిన పవన్‌కల్యాణ్, ఫ్యాన్స్ ధీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Pawan Kalyan
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాననే ప్రచారంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారట. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారని, ఆయన త్వరలో టిడిపిలో చేరుతారని కొన్ని వెబ్‌సైట్‌లలో గాసిప్స్ వచ్చాయి.

దీనిపై ఓ మీడియా ప్రతినిధి పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారట. తాను టిడిపిలోకి చేరుతాననే గాసిప్స్ పైన పవన్ కల్యాణ్ నవ్వుతూ.. నేను టిడిపిలోకా.. అంటూ నో చెప్పారట. పవన్ కల్యాణ్ టిడిపిలో చేరుతారనే వార్తలను దాదాపు ఎవరు నమ్మలేదనే చెప్పవచ్చు. వాటిని వట్టి గాసిప్స్‌గానే అందరూ కొట్టి పారేశారు.

ఈ ప్రచారం మాత్రం ఇంటర్నెట్లో జోరుగా చక్కర్లు కొట్టింది. మెగా ఫ్యాన్స్ కూడా పవన్ కల్యాణ్ టిడిపిలో చేరుతారనే ప్రచారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదట. అదంతా వట్టిదేనని కొట్టి పారేశారట. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా స్వయంగా ఓ మీడియా ప్రతినిధి వద్ద స్వయంగా కొట్టి పారేశారట.

దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య కూడా రెండు రోజుల క్రితం ఈ ప్రచారాన్ని కొట్టి పారేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రామచంద్రయ్య స్పష్టం అన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన అన్నారు సోమవారం తిరుమల వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ తెదేపాలో చేరే ప్రసక్తే లేదని సి. రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని రామచంద్రయ్య అన్నారు.

English summary
The endowment minister C Ramachandraiah said that union minister chiranjeevi's brother Pawan Kalyan will not join in Telugudesam party. Mega fans also condemning rumors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X