రాజీనామాకు సింధియా డిమాండ్: శ్రీనివాసన్ నో

ఐపియల్‌లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్ అరెస్ట్ కావడంతో బిసిసిఐ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యవహారంలో తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, క్రికెట్ ను వివాదాలు చుట్టు ముట్టిన నేపథ్యంలో విచారణ సాఫీగా జరగడానికి శ్రీనివాసన్ తప్పుకోవాల్సిన అవసరం ఉందని సింధియా మీడియాకు వెల్లడించారు.
సింధియా రాజీనామా డిమాండ్‌ను శ్రీనివాసన్ తోసిపుచ్చారు. అది అతని అభిప్రాయమని, అంతకు మించి తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. శ్రీనివాసన్ రాజీనామాకు డిమాండ్ చేసిన మొదటి బిసిసిఐ ఆఫీస్ బియరర్. గురునాథ్ కేసు పరిష్కారం అయ్యే వరకు శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications