ఛీ!: హోంశాఖ లాబీయింగ్‌పై జానా, బాబుపై జగన్ పార్టీ

Jana Reddy
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని అడగలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం అన్నారు. తాను హోంమంత్రిత్వ శాఖ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మంత్రివర్గంలోని అన్ని శాఖలు మంచివే అన్నారు. తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో స్థానిక సంస్థల ఎన్నికల పైన మాత్రమే చర్చించానని, శాఖలపై చర్చించలేదన్నారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెసును వీడే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం పార్లమెంటు సభ్యులను, నేతలను పిలిచి మాట్లాడితే బాగుంటుందన్నారు. నేతలు పార్టీని వీడితే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందన్నారు. అది ఎన్నికలలో మాత్రమే తెలుస్తుందని చెప్పారు. 2014లోపు కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకుందని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

చంద్రబాబుపై జగన్ పార్టీ మండిపాటు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిఎల్పీ తీవ్రస్థాయిలో మండిపడింది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు మర్చిపోతున్నారన్నారు. చంద్రబాబును అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ చంద్రబాబు వారిపై పెదవి విప్పడం లేదన్నారు. రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడకుండా చట్టంలో మార్పులు తీసుకు రావాలన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఒక్కటయ్యాయని ఆరోపించారు.

బాబు వ్యాఖ్యలను ఖండించిన జైళ్లశాఖ డిజి

జైళ్లలో నిందితులు మద్యం తాగుతున్నారని నీలి చిత్రాలు చూస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను జైళ్ల శాఖ డిజి ఖండించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. దేశంలోనే రాష్ట్ర జైళ్ల శాఖకు మంచి పేరుందన్నారు. జగన్‌కు స్పెషల్ క్లాస్ ఖైదీలకు ఇచ్చే సదుపాయమే కల్పిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ములాకత్‌లపై టిడిపి ఇప్పటికే సమాచారం హక్కు చట్టం కింద వివరాలను తీసుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+