జగన్‌కు ఎక్కువేం చేయడం లేదు: జైళ్ల శాఖ డిజి

ములాఖత్‌తలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకుందని తెలిపారు. జైళ్లలో ఉన్న నిందితులు లేదా ఖైదీలు మద్యం తాగుతున్నారని, వినోదం కోసం నీలి చిత్రాలు కూడా చూస్తున్నారని, అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని, హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
తెలుగుదేశం పార్టీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. దేశంలోనే రాష్ట్ర జైళ్ల శాఖకు మంచి పేరుందని ఆయన గుర్తు చేశారు. చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు.
జైలులో వైయస్ జగన్‌కు అదనపు సౌకర్యాలు అందుతున్నాయని, జగన్‌కు జైలు అధికారులు అదనపు సౌకర్యాలు కలిగిస్తున్నారని, ములాఖత్‌లు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications