చిరు, బాబులపై అలక!: బాబుతో పవన్, జగన్‌తో ఎన్టీఆర్

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల జూనియర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పట్ల పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. ఆ అసంతృప్తి కారణంగానే చర్చకు తెరలేచిందని చెప్పవచ్చు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో జూనియర్ ఫోటోలు ఆ పార్టీకి చెందిన ఫ్లెక్సీలలో కనబడటం చర్యనీయాంశమైంది. విజయవాడలో ప్రారంభమైన ఈ ఫ్లెక్సీల గొడవ రాష్ట్ర రాజధాని హైదరాబాదు వరకు చేరింది.
జగన్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తదితరుల ఫోటోలను పెట్టింది. మిగతా వారికి రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. జూనియర్ మాత్రం టిడిపి పట్ల అసంతృప్తిగా ఉండటమే కాకుండా ఆయన సన్నిహితుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్‌కు జై కొట్టారు.
దీంతో జగన్ పార్టీ ఫ్లెక్సీలలో జూనియర్ ఫోటో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతను పరోక్షంగా వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు పలుకుతారా అనే వరకు వెళ్లింది చర్చ. టిడిపి పట్ల ఇప్పటికీ అసంతృప్తితో ఉన్న ఎన్టీఆర్ మాత్రం తాను తాత స్థాపించిన పార్టీకే మద్దతు పలుకుతానని చెబుతున్నారు.
చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కూడా కొద్ది రోజులుగా చర్చనీయాంశమయ్యారు. పవన్ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని, ఆయన ఎప్పుడైనా టిడిపిలో చేరుతారనే ప్రచారం ఇంటర్నెట్‌లో జోరుగా సాగింది. అందుకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పట్ల పవన్ అలక వహించారనే వాదన ఉండటమే కారణమంటున్నారు. పవన్ టిడిపిలో చేరుతారనే ప్రచారాన్ని మంత్రి రామచంద్రయ్య ఖండించారు. అయితే, టిడిపిలో చేరుతారనే ప్రచారం పవన్ కల్యాణ్‌కు నవ్వు తెప్పించిందట.












Click it and Unblock the Notifications