అంకిత్ చవాన్‌కు ఊరట: జూన్ 6దాకా పెళ్లికి బెయిల్
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెట్ అంకిత్ చవాన్‌కు కోర్టులో ఊరట లభించింది. పెళ్లి చేసుకునేందుకు వీలుగా ఆయనకు కోర్టు జూన్ 6వ తేదీ వరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన తన వివాహం ఖరారైందని, వివాహం జరగకపోతే తన ప్రతిష్టతో పాటు తన వధువు ప్రతిష్ట కూడా దెబ్బ తింటుందని అంటూ తనకు వివాహం చేసుకోవడానికి బెయిల్ మంజూరు చేయాలని అంకిత్ చవాన్ కోర్టును కోరారు.
తాను తప్పు చేసినట్లు తనపై ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని, తనను కేసులో ఇరికించారని అంకిత్ చవాన్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అజిత్ చండిలలతో పాటు అంకిత్ చవాన్‌ను పోలీసులు మే 16వ తేదీన అరెస్టు చేశారు.

శ్రీశాంత్ మిత్రుడికి బెయిల్
ఇదిలావుంటే, సాక్ష్యాలను మార్చాడనే ఆరోపణపై అరెస్టయిన శ్రీశాంత్ మిత్రుడు అభిషేక్ శుక్లాకు బెయిల్ లభించింది. తమకు పాస్‌పోర్టును, 25 వేల రూపాయ బాండును సమర్పించాలని ఢిల్లీ కోర్టు శుక్లాను ఆదేశించింది. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే శుక్లాను ముంబై తీసుకుని వెళ్లడంపై కోర్టు పోలీసులను తప్పు పట్టింది.
అభిషేక్ శుక్లా సహాయంతో పోలీసులు శ్రీశాంత్‌కు బుకీలు ముట్టజెప్పిన 5.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బుకీలు మొత్తం శ్రీశాంత్‌కు పది లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. పోలీసులు పది లక్షల రూపాయల లెక్క తేల్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications