అంకిత్ చవాన్ స్థితి: పెళ్లి పెటాకులు, అవార్డు తుస్
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న క్రికెటర్ అంకిత్ చవాన్ రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్‌లో చిక్కుకుపోయి ఉండకపోతే అతని జీవితమే వేరుగా ఉండేది. పెళ్లికి ముందు జరిగే ఉత్సవాల్లో ఆనందంగా గడుపుతూ ఉండేవాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) నుంచి 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందుకుని ఉండేవాడు.
అంకిత్ చవాన్ పెళ్లి జూన్ 2వ తేదీన జరగాల్సి ఉంది. అయితే, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. సామాజిక సెంటిమెంట్ల కారణంగా బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అంకిత్ చవాన్ పెళ్లిని వాయిదా వేసుకోవాలని కోర్టు ఈ నెల 28వ తేదీన కోర్టు ఆయన తరఫు న్యాయవాదికి చెప్పింది. సహ నిందితులతో కలిసి చేశాడని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నేర తీవ్రతను, కుట్రను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ కోసం అంకిత్ చవాన్ సెషన్స్ కోర్టుకు వెళ్లాడు.

ఇదిలావుంటే, బిసిసిఐ సస్పెండ్ చేసినందున అంకిత్ చవాన్‌కు నగదు బహుమతిని అందజేయలేమని ఎంసిఎ స్పష్టం చేసింది. 40వ రంజీ టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా ఎంసిఎ బుధవారంనాడు అన్ని వయస్సులవారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాంఖడే స్టేడియంలో జరిగింది.
అంకిత్ చవాన్ 33 వికెట్లు తీసుకుని రంజీ ట్రోఫీలో ముంబై విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు. బిసిసిఐ అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో అతను ఏ విధమైన అవార్డులకు కూడా అర్హుడు కాడు. అతని ప్రైజ్ మనీని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా, అతని పేరును కార్యక్రమంలో చదివినందుకు తప్పు పట్టారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications