ధీమా ఏంటి?: రిజైన్‌పై శ్రీనివాసన్ తగ్గకపోవడం వెనుక..!

Srinivasan
న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా చేయకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. మీడియా, క్రీడామంత్రిత్వ శాఖ, బోర్డు సభ్యుల పలువురు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నప్పటికీ శ్రీనివాసన్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనుకకు వేయడం లేదు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ఇప్పటికి రెండుమూడుసార్లు చెప్పారు. రాజీనామాపై ఆయన మెట్టు దిగకపోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.

అధ్యక్షుడిని తప్పించేందుకు బోర్డుకు అవకాశాలు ఉన్నాయి. అత్యవసర ఏజిఎం నిర్వహించి, ఓటింగులో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే అధ్యక్షుడిని సాగనంపవచ్చు. అయితే శ్రీనివాసన్ విషయంలో అది అంత సులభంగా కుదిరే పని కాదు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ సంఘాల్లో మంచి మద్దతు ఉంది. బిసిసిఐ ఓటంగ్ హక్కున్న అనుబంధ యూనిట్ల సంఖ్య 30. తీర్మానం వీగిపోయేలా చేయాలంటే శ్రీనివాసన్‌కు 11 ఓట్లు కావాలి.

దక్షిణాదిన ఉన్న ఆరు క్రికెట్ సంఘాలు అతనికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయనకు ఎలాగు ఓటు హక్కు ఉంటుంది. మరో నాలుగు ఓట్లు సాధించడం ఆయనకు పెద్దగా కష్టం కాదనే చెప్పవచ్చు. ఓటింగ్ నిర్వహిస్తే శ్రీనివాసన్ బయటపడతాడు. అంతేకాకుండా ఓటింగ్ సంగతి పక్కన పెడితే.. ఎజిఎంనే రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. అందుకే అతనిని తప్పించడం కష్టమే.

బిసిసిఐ అధ్యక్షుడిపై విమర్శలు వస్తున్నా బోర్డు మెంబర్లు అంతగా పట్టుబట్టక పోవడానికి గల కారణం.. తమ భవిష్య్తత్తు ప్రమాదంలో పడవద్దనే! అతను ఎంత శక్తివంతుడో మెంబర్స్‌కు తెలుసు. ఆయన తర్వాత అధ్యక్షుడు కావాలనుకుంటున్న వారు శ్రీనివాస్ మద్దతును కోరుకుంటారు. ఆయన వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి. అతనితో శత్రుత్వం పెంచుకుంటే ఓటమి ఖాయమనే ఆందోళన పలువురిలో ఉండి ఉండవచ్చునని అంటున్నారు.

అందుకే రాజీనామా చేయమని కోరుతున్నారే తప్ప డిమాండ్ చేయడం లేదట. ఇక తాను అధ్యక్షుడిగా ఉంటేనే చిక్కుల్లో నుండి బయటపడ వచ్చునని భావిస్తున్నందువల్లే శ్రీనివాసన్ రాజీనామా చేయడం లేదంటున్నారు. మరోవైపు శ్రీనివాసన్‌కు ఆర్జేడి మద్దతు పలుకుతోంది. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+