కాలర్‌పై లిప్‌స్టిక్ జోక్: ఒబామాకు భార్య భయామా..

Barack Obama
వాషింగ్టన్: తన కాలర్‌పై లిప్‌స్టిక్ మరక మీద అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా హాస్యమాడారు.తన చొక్కా కాలర్ మీద లిప్‌స్టిక్ మరక పడటంతో ఆ లిప్‌స్టిక్ పూసింది ఎవరో వెతికి పట్టుకుని, ఆ విషయాన్ని తాను మిషెల్‌కు చెప్పాలని లేకపోతే ఇంట్లో గొడవలు తప్పవని ఒబామా జోక్ చేశారు.

అందుకు ఓ కార్యక్రమానికి హాజరైన అందరినీ సాక్షులుగా కూడా ఉండాలన్నారు. ఈ సరదా సన్నివేశం ఆసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీ) సమావేశంలో చోటుచేసుకుంది. అక్కడ పలువురు భారత సంతతి అమెరికన్లతో సహా దాదాపు 300 మంది ఆసియన్లు ఉన్నారు. దాదాపు వారిలో ప్రతి ఒక్కరినీ ఒబామా పేరు పేరునా పలకరించారు.

తర్వాత ఉన్నట్టుండి షర్టు కాలర్ చూసుకుని, దానిమీద లిప్‌స్టిక్ మరక ఉందని, అదెంతో వెచ్చగా అనిపిస్తోందని నవ్వుతూ అన్నారు. అమెరికన్ ఐడల్ -11 పోటీలో రన్నరప్‌గా నిలిచిన జెస్సికా శాంచెజ్ బంధువు ఒకామె ఈ మరక వేసిందని చివరకు గుర్తించారు.

"నాకు ఈ ముద్దాయి ఎవరో తెలుసనుకుంటా. జెస్సికా శాంచెజ్ ఎక్కడుంది? ఆ.. మరక వేసినది మాత్రం ఆమె కాదు. వాళ్ల ఆంటీ. ఆమె కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న వారంతా నాకు సాక్షులుగా ఉండాలి. అప్పుడే నాకు మిషెల్‌తో సమస్యలు రావు. అందుకే అందరిముందు చెబుతున్నా'' అంటూ హాస్యమాడి సరదాగా నవ్వించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+