అగ్ని ప్రమాదం: బిల్డింగ్ పైనుండి దూకి యువతి మృతి

మినిస్టర్ రోడ్స్‌లోని కిమ్స్ ఆసుపత్రి పక్క వీధిలోని ప్రేమ్ ఆర్కెడ్ అపార్టుమెంటులో సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో కార్ డెకారేట్స్ షాప్, గోదం ఉండగా, రెండో అంతస్తు ఖాళీగా ఉంది. మూడో అంతస్తులో జిమ్ ఉంది. మొదటి అంతస్తులోని గోదాంలో మంటలు లేచాయని తెలుస్తోంది. అవి మూడో అంతస్తుకు వ్యాపించాయి. మూడో అంతస్తులో ఉన్న ఇరవయ్యొక్క ఏళ్ల రిచా మంటల నుండి కాపాడుకునేందుకు దూకబోయి కిందపడి మృతి చెందారు.
విశాఖ గ్లోకెమ్‌లో...
విశాఖ నగరంలోని శివారు లంకెపాలెం సమీపంలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల గ్లోకెమ్ ఔషధ పరిశ్రమలో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఔషధ ఉత్పత్తుల తయారీలో భాగంగా సోడియంను రియాక్టర్‌కు ఛార్జీ చేసే సమయంలో దానిపై నీరు పడటంతో మంటలు వ్యాపించాయి. తొలుత ప్రొడక్షన్ బి బ్లాకులో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత పరిశ్రమ మొత్తం దగ్ధమైంది. రియాక్టర్లు, సోడియం సాల్వెంట్ డ్రమ్ములు భారీ ఎత్తున పేలుడుకు గురయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది.
కర్నూలు జిల్లాలో పెళ్లి బస్సు దగ్ధం
కర్నూలు జిల్లా మన్యం గ్రామం సమీపంలోని కర్నూలు - గుంటూరు రహదారిపై గురువారం రాత్రి పెళ్లి బస్సు దగ్ధమైంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎమ్.చర్నోపల్లె గ్రామానికి చెందిన పెళ్లి బృందం వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా మన్యం గ్రామ సమీపంలో దట్టమైన పొగలు రావడంతో కిందకు దిగారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది.












Click it and Unblock the Notifications