లేఖ తెస్తే బాబు సంతకం, టిడిపిలో చేరు: కెసిఆర్‌కి టిడిపి

టిడిపి తెలంగాణపై ఇచ్చిన లేఖ సరిపోదని కేంద్ర హోంశాఖ చెబితే... అక్కడికక్కడ కెసిఆర్, హోంశాఖలు కలిసి ఓ లేఖ తయారుచేసి తీసుకు వస్తే తమ పార్టీ అధ్యక్షుడు సంతకం చేస్తారన్నారు. టిడిపి, బిజెపి, సిపిఐ, తెరాస అన్ని తెలంగాణకు అనుకూలమని చెప్పాయని, అయినా తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని కెసిఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.
కెసిఆర్‌కు తెలంగాణ రావడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. కెసిఆర్ వచ్చి తెలుగుదేశంలో చేరాలని, టిడిపి అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధిస్తామన్నారు. కెసిఆర్ తెలంగాణకు అనుకూలం కాదని, కేవలం సొంత కుటుంబానికి పదవుల కోసం, రాజకీయం స్వార్థం కోసం, వసూళ్ల కోసం తెలంగాణ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు నెలల్లో మూత: వర్ల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుకాణం మరో మూడు నెలల్లో మూతపడుతుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెదేపాకు నిన్న జరిగిన మహానాడే అఖరిదని ఆ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికే 32 మహానాడులు జరుపుకున్నామని, భవిష్యత్‌లో ఎన్నో మహానాడులు జరుపుకోబోతున్నామన్నారు. జగన్ పార్టీకు నూకలు చెల్లబోతున్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జగన్ బెయిల్ పిటీషన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతల్లో నిరుత్సాహం మొదలైందన్నారు.












Click it and Unblock the Notifications