వైఎస్ యస్ అన్నాకే: వర్ల, బాబు సారీచెప్పాలి: జూపూడి

జగన్‌కు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన డైరెక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. జగన్ అవినీతిలో వైయస్ పాత్ర ఎంత వరకు ఉందో వెలికితీయాలన్నారు. ఆయన మృతి చెందాడన్న సానుభూతి అవినీతిని నిగ్గుతేల్చే విషయంలో పనికి రాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
బాబు క్షమాపణ చెప్పాలి: జూపూడి
జైలులోని ఖైదీలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. చూస్తుంటే చంద్రబాబు మానసిక స్థితి బాగా లేదనిపిస్తోందన్నారు.
జైళ్ల శాఖ అధికారులు వాస్తవాలు చెబుతున్నప్పటికీ జగన్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ను కేసులలో ఇరికించేందుకే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణను ఇంతకాలం కొనసాగించారన్నారు. జైల్లో మద్యం, బ్లూఫిల్మ్స్ అని బాబు అనడం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications