నేను కాకుంటే ఇంకెవరు: అంకిత్ చవాన్ ఫియాన్సీ

ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్ అంకిత్ చవాన్‌కు కాబోయే భార్య పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అంకిత్ చవాన్ అమాయకుడని, నిర్దోషి అని ఆయనకు కాబోయే భార్య నేహా సంబారి అంటున్నారు. ఓ టాబ్లాయిడ్ పత్రికతో ఆమె మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన అంకిత్ చవాన్‌ను ఆమె వివాహం చేసుకోబోతోంది.

అంకిత్ చవాన్‌తో ఆమె సంబంధం గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది. వివాహం చేసుకోవడానికి కోర్టు అంకిత్ చవాన్‌కు బెయిల్ కూడా ఇచ్చింది. తాను ఇదివరకే అంకిత్ కుటుంబంతో పెళ్లి చేసుకున్నానని నేహా అన్నారు. ఐటి కన్సల్టెంట్ అయిన నెహా సంబారి - అంకిత్ చవాన్ త్వరలోనే నిర్దోషిగా బయటపడుతాడని అన్నారు.

ఆదివారంనాడు తాను అంకిత్‌ను వివాహం చేసుకోబోతున్నానని, కానీ తాను ఇదివరకే ఆ కుటుంబ సభ్యులతో వివాహం చేసుకున్నానని, వెనక్కి తగ్గాలని తాను ఓ క్షణంలో కూడా అనుకోలేదని, అంకిత్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసునని ఆమె అన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో తాను కాకుండా అంకిత్‌కు ఇంకెవరు అండగా ఉంటారని ఆమె ప్రశ్నించారు.

Ankeet Chavan

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్, అజిత్ చండిలలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అంకిత్ చవాన్ మే 16వ తేదీన పోలీసుల చేతిలో అరెస్టయిన విషయం తెలిసిందే. జూన్ 6వ తేదీ వరకు కోర్టు అంకిత్ చవాన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

జైలు నుంచి విడుదల

అంకిత్ చవాన్ శుక్రవారం రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతను రాత్రి 8 గంటల ఐదు నిమిషాలకు విడుదలయ్యాడని అధికారులు చెప్పారు. పెళ్లి కోసం అంకిత్ చవాన్‌కు కోర్టు జూన్ 6వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+