మీరు తెస్తారు... బిజెపికి ఓటేస్తే ఇస్తారు: కెసిఆర్‌కు నాగం

అందరు ఉద్యమం చేసి తెరాసకే ఓటు వేయాలని ఆయన చెబుతున్న మాటలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వదన్నారు. 2014లో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, అప్పుడు బిజెపి తెలంగాణను ప్రకటిస్తుందని చెప్పారు.
బిజెపిని కెసిఆర్ మతతత్వ పార్టీ అని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని కలిసినప్పుడు బిజెపి మతతత్వ పార్టీ అని కెసిఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దేశమంతా బిజెపిని గెలిపించి రాష్ట్రంలో మాత్రం ఓడించాలన్నట్లుగా కెసిఆర్ మాటలు ఉన్నాయన్నారు.
ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ సాధ్యం కాదన్నారు. తెరాస పుట్టకముందే బిజెపి తెలంగాణవాదం పలికిందన్నారు. కాంగ్రెసు అధికారంలోకి రాదని, బిజెపితోనే తెలంగాణ సాధ్యం కాబట్టి తాను అదే పార్టీలో ఈ నెల 3న చేరుతున్నానని నాగం ఈ సందర్భంగా చెప్పారు.
తెరాసకు ఓటేస్తే ఎక్కువ సీట్లు గెలిపిస్తే కెసిఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను తీసుకు వస్తారాట.. కానీ బిజెపికి ఓటేసి గెలిపిస్తే అదే పార్టీ ఇస్తుందని నాగం అన్నారు. కాగా, నాగం జనార్ధన్ రెడ్డి ఈ నెల మూడో తేదిన బిజెపి నిజాం కళాశాల బహిరంగ సభలో ఆ పార్టీలో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications