పని మనిషిగా తెచ్చుకొని రెండేళ్లుగా బాలికపై టెక్కీ రేప్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసులకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్‌పర్సన్ పద్మావతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రక్‌కు చెందిన నలభయ్యేళ్ల ప్రదీప్ కొన్నేళ్లుగా కెపిహెచ్‌బి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.
అతడి భార్య కూడా ఉద్యోగానికి వెళుతోంది. తన గ్రామానికే చెందిన బాలికను ఇంట్లో పని కోసం తెచ్చాడు. భార్య లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక దుస్థితిని గమనించిన స్థానికులు కొందరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమచారం అందించారు.
కమిటీ సభ్యులు బాలికను సంరక్షణలోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెపిహెచ్‌బి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందుతుడి పైన కేసును నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని కెపిహెచ్‌బి పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications