కెబిఆర్ పార్క్‌లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా సిఎం కిరణ్

ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా వచ్చారు. పాత స్నేహితులు ఎనిమిది మందితో కలిసి పార్కులోకి వెళ్లారు. పలువురు వాకర్లు ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. కెబిఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి జైవీర్ రెడ్డి తదితరులతో కిరణ్ కాసేపు మాట్లాడారు. పాతమిత్రులు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ఏడాది తర్వాత కెబిఆర్ పార్కులో మార్నింగ్ వాక్‌కు వచ్చారు. ఆయన ఉల్లాసంగా కనిపించారు. అంతకుముందు కిరణ్ ఢిల్లీకి వెళ్లొచ్చారు. మంత్రివర్గ విస్తరణ, తనతో విభేదిస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్.. ఇలా తనకు అనుకూలంగా ఉన్నందువల్లే ఆయన ఉత్సాహంగా కనిపిస్తుండవచ్చునని అంటున్నారు.
కిరణ్‌లోని ఉత్సాహం చూస్తుంటే త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు అధిష్టానం నుండి అనుమతి వచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు. అందులో భాగమే డిఎల్ రవీంద్ర రెడ్డి బర్తరఫ్ అంటున్నారు. ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, డిఎల్ రవీంద్ర రెడ్డిల స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications