పార్టీ విలీనంపై పవన్ అభిప్రాయం చిరంజీవి అడగలేదా?

Chiranjeevi - Pawan Kalyan
హైదరాబాద్: తాను, తన సోదరుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చాయని, అందులో నిజం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోదరుడు, ప్రముఖ నిర్మాత, నటుడు నాగబాబు అన్నారు. తాను, పవన్ సినిమాలలో బిజీగా మారామని దీంతో రాజకీయాల్లో చిరంజీవి ఒక్కరయ్యారన్న చిన్న బాధ ఉందని చెప్పారు.

నాగబాబు ఆదివారం రాత్రి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాజకీయాలపై కూడా స్పందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడం నచ్చిందని కానీ, నచ్చలేదని కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడు చెప్పలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి అందరి సలహాలు అడిగారని చెప్పారు.

కాంగ్రెసులో కలిపేటప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలలో బిజీగా ఉండటం వల్లన అడగలేక పోయారన్నారు. పార్టీకి మాత్రం ప్రచారం చేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పాడన్నారు. పవన్ ఎవరి మాట వినరని, అన్నయ్య గట్టిగా చెబితే మాత్రం కాదనడన్నారు.

ప్రజారాజ్యం పార్టీ విజయవంతం కాకపోవడానికి కారణం సమష్టి వైఫల్యమే అన్నారు. అల్లు అరవింద్‌ను ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. పార్టీ నడిపిన ఏడాది కాలంలో ప్రజలు అవినీతిపరులైపోయారన్న విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఎన్నికల్లో అరవై శాతం ఓటింగ్ మాత్రమే జరుగుతోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+