తాతను చేర్చుకొని చేసేదేమిటి: కెసిఆర్‌కు సోమిరెడ్డి ప్రశ్న

తెలంగాణలో రెవెన్యూ ఎక్కువందని ఓసారి, వెనుకబడిందని మరోసారి కెసిఆర్ మాట్లాడుతుంటారన్నారు. ఉద్యమ నేతగా కెసిఆర్ వాస్తవాలు మాట్లాడాలన్నారు. కెసిఆర్, తెరాసలో చేరిన మందా జగన్నాథంతో రాజకీయ శిక్షణా తరగతులు పెట్టించాలని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ తిట్లను నేర్పించడంలో, మందా పార్టీలు మారడంలో శిక్షణ ఇస్తారన్నారు.
నాడు కాంగ్రెసుకు అమ్ముడుపోయిన మంద జగన్నాథం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆంధ్రావాళ్లపై తెరాస నేతలు అనవసరంగా నోరు పారేసుకోవద్దన్నారు. తెరాసలో రిటైరైన తాతను చేర్చుకున్నారని, ఆయనతో ఏం సాధిస్తారని కె కేశవ రావును ఉద్దేశించి అన్నారు.
నాగం వ్యాఖ్యలను తప్పు పట్టిన హరీష్
నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు తప్పు పట్టారు. రాజకీయ నిర్ణయం ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు. తెరాస ఎదిగితేనే రాష్ట్రం వస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదన్న నాగం వ్యాఖ్యలు సరికాదన్నారు. తెరాస లేకుంటే ఉద్యమమే లేదనే విషయాన్ని నాగం గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications