పారిపోతున్న బుకీ ముంబై విమానాశ్రయంలో అరెస్ట్

మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సిఈవో, బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ పోలీసు కస్టడీని ముంబై కోర్టు ఈ నెల 14వ తేది వరకు పొడిగించింది. బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ కస్టడీని కూడా పొడిగించింది.
విచారణ కమిషన్‌లో దాల్మియా
గురునాథ్ బెట్టింగ్, ముగ్గురు క్రికెటర్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిషన్‌లో బోర్డు నుండి సభ్యుడిగా దాల్మియా ఎంపికయ్యారు. గతంలో ఈ స్థానంలో ఉన్న కార్యదర్సి సంజయ్ జగ్దాలే తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. మిగతా ఇద్దరు సభ్యులుగా రిటైర్డ్ జడ్జిలు కొనసాగనున్నారు.
శ్రీనివాసన్ స్థానంలో బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన జగ్మోహన్ దాల్మియా మాట్లాడుతూ... క్రికెట్ ఆటను క్లీన్‌గా చేయడమే తన లక్ష్యమన్నారు. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత పోయిన క్రెడిబిలిటిని తీసుకు వస్తామన్నారు. కాగా విచారణ పూర్తయ్యే వరకు శ్రీనివాసన్ తప్పుకోవడంతో దాల్మియా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications