అంకిత్ చవాన్ పెళ్లికి క్రికెటర్లు దూరం, పోలీసు మస్తు
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలై క్రికెటర్ అంకిత్ చవాన్ నేహా సంబారిని ఆదివారంనాడు అతి సాధారణమైన రీతిలో పెళ్లి చేసుకున్నాడు. పెద్దగా హంగామా లేకుండా పెళ్లి జరిగిపోయింది. చాలా మంది క్రికెటర్లు, సెలిబ్రిటీలు ఈ వివాహానికి దూరంగా ఉన్నారు. పోలీసులు మాత్రం పెద్ద యెత్తున కనిపించారు.
తెల్లటి డిజైనర్ కుర్తా, ముదురు గోధుమ రంగు ధోతీ, ఎర్రటి టర్బన్ ధరించి అంకిత చావన్ శివాజీ పార్కు సమీపంలోని కోహినూరు బంకెట్ హాల్‌కు చేరుకున్నాడు. ఈ పెళ్లి ఊరేగింపులో కుటుబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, ఇరుగుపొరుగువారు, మఫ్టీ దుస్తుల్లో పెద్ద యెత్తున పోలీసులు పాల్గొన్నారు.

పెళ్లికి చాలా మంది క్రికెటర్లను, మాజీ క్రికెటర్లను, అధికారులను అహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. క్రికెటర్లు వివాహానికి హాజరు కాలేదు. తాను ముంబైలో లేనని, ముంబైలో ఉన్నా పెళ్లికి వెళ్లేవాడినో లేదో తెలియదని ఆ సీనియర్ క్రికెటర్ అన్నాడు. రంజీ ట్రోఫీ జట్టు సహచరులు కూడా అంకిత్ పెళ్లికి హాజరు కాలేదు.
పెళ్లి చేసుకోవడానికి గాను అంకిత్ చవాన్ తీహార్ జైలు నుంచి మే 31వ తేదీన విడుదలయ్యాడు. జూన్ 6వ తేదీ వరకు కోర్టు అతని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ మే 16వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications