కొద్ది కాలం ధోనీ వాటాదారు: రితీ సంస్థ వివరణ

ధోనీకి తమ సంస్థలో కొద్ది కాలం మాత్రమే వాటాలున్నాయని, ప్రస్తుతం ఏ విధమైన వాటాలు లేవని రితీ స్పోర్ట్స్ చెప్పింది. ఏడాదికి పైగా పడిన బకాయిల వ్యవహారాన్ని తీర్చడానికి ధోనీకి ఈ ఏడాది మార్చి 22వ తేదీన వాటాలను కేటాయించినట్లు తెలిపింది.
బకాయిలను 2013 ఏఫ్రిల్ తీర్చామని, ధోనీ వాటాలు తిరిగి కంపెనీ ప్రమోటర్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన కంపెనీ ప్రమోటర్‌కు బదలాయింపు జరిగాయని రితీ స్పోర్ట్స్ చైర్మన్ అరుణ్ పాండే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ధోనీ ప్రయోజానాలు అంటగడుతూ మీడియాలో వచ్చిన వార్తలకు తాము చాలా బాధపడ్డామని ఆయన చెప్పారు.
ఊహాగానాలకు తెరదించడానికి, వాస్తవాలను తెలియజేయడానికి తాము ఈ వివరణ ఇస్తున్నామని, వాస్తవాలను ముందు పెడుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications