టెండూల్కర్‌నవుతా: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
బెంగళూర్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మొదటి ఇన్నింగ్సులో అదరగొట్టిన 66 ఏళ్ల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రెండో ఇన్నింగ్సులో కూడా అదరగొట్టాలని చూస్తున్నారు. ఇన్ఫోసిస్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి తన హీరో సచిన్ టెండూల్కర్‌ను అనుసరిస్తానని ఆయన అన్నారు. ఓ టీవీ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఆ విధంగా అన్నారు.
టెండూల్కర్ తనకు గొప్ప నాయకుడని, 35 ఏళ్ల వయస్సుకు చేరుకున్న క్రికెటర్లు చాలా మంది క్రికెట్ నుంచి తప్పుకున్నారని, సచిన్ టెండూల్కర్ మాత్రం 40 ఏళ్ల వయస్సులో నిలదొక్కుకున్నాడని, ఈ రోజు కూడా ఫలితం సాధిస్తున్నాడని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని, అతని లాగా పనిచేస్తే తనకు ఆనందంగా ఉంటుందని నారాయణ మూర్తి అన్నారు.

నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి ఆయన తిరిగి ఇన్పోసిస్ బోర్డులో చేరారు. అకస్మాత్తుగా తనను తిరిగి ఆహ్వానించడంపై కూడా స్పందించారు. తనను మళ్లీ పిలువడం అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు.
ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ కావడంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టేసి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడినట్లు ఆయన ఇప్పటికే చెప్పారు. ఆయన కుమారుడు రోహణ్ మూర్తి కూడా ఇన్ఫోసిస్‌లో చేరుతున్నాడు. ఆయన నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications