కూతురింట్లో తర్వాత భార్యవద్ద కరుణ బర్త్‌డే, రజనీ విషెస్
చెన్నై: డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పుట్టిన రోజు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ, ఆయన అభిమానులు ఘనంగా చేసుకున్నారు. ఈ రోజు కరుణ 90వ పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కరుణానిధికి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత తన గారాలపట్టి కనిమొళి నివాసంలో వేడుకలు జరుపుకున్న కరుణానిధి తరువాత పెద్ద భార్య దయాళు అమ్మాళ్ నివాసంలో జరుపుకున్నారు.

గత ఓటమితో అప్పుడు జన్మదినాన్ని జరుపుకోని ఆయన ఈ ఏడాది జన్మదిన వేడుకలను జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు జరిగిన సాధారణ ఎన్నికలలో డిఎంకె ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆ ఏడాది ఆయన ఎన్నికలు జరుపుకోలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామనే ధీమాలో కరుణానిధి ఉన్నారు.
కరుణానిధి 90వ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిండ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రజనీకాంత్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, గత ఎన్నికలలో రజనీకాంత్ అన్నాడిఎంకెకు అనుకూలంగా ఓటు వేసినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications