కొత్త సినిమాలో బాలకృష్ణ 'రాజకీయం' చేయనున్నారా?

మరోవైపు ఈ సినిమా రాజకీయా వర్గాల్లోను ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. అదే సమయంలో ఇటీవల ఆయన సినిమాలు ఏవీ ప్రారంభం కాలేదు. దీంతో ఆయన ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారని, సినిమాలకు దూరంగా ఉంటారని భావించారు. అయితే ఇప్పుడు సినిమా ప్రారంభం కావడంతో ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. అంతకుముందు వచ్చే సంక్రాంతి పండుగకు సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. సంక్రాంతికి విడుదలైన బాలయ్య చిత్రాలు సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యాయి. రాజకీయ నేపథ్యంలోనే కాకుండా పార్టీకి అనుకూలంగా ఉండే అంశాలు ఈ సినిమాలో ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ చిత్రం విడుదలయింది.
ఉప ఎన్నికలకు పది రోజుల ముందు ఆ సినిమా విడుదలయింది. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ... తాను సినిమా ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. తద్వారా శ్రీమన్నారాయణ ఉప ఎన్నికలకు ప్రచారంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఆ చిత్రం యావరేజ్‌గా నడవడమే కాకుండా... ఉప ఎన్నికల్లోను టిడిపి బోల్తా పడింది. మరి వచ్చేది రాజకీయ నేపథ్య సినిమా అయితే టిడిపికి ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications