గండ్ర వర్సెస్ డిఎల్: సిఎల్పీలో మీడియా హడావుడి

అనంతరం ఆయన సిఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే సిఎల్పీలో చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, రుద్రరాజు పద్మరాజులు ఉన్నారు. దీంతో ప్రెస్ గదిని తెరిపించారు. డిఎల్ కూడా ప్రెస్ గదికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ కాసేపు మీడియా హడావుడి కనిపించింది. డిఎల్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో డిఎల్ మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సిఎల్పీ మీడియా గదిలో గండ్ర అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం గమనార్హం.
మీడియా పాయింట్ వద్ద విలేకరులతో డిఎల్ మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తనను కేబినెట్ నుండి తప్పించారని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తన వాదన వినిపించేందుకు సిఎల్పీ సహకరించలేదన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో తనకు దురదృష్టకరమైన పరిణామం ఎదురయిందన్నారు. బ్రిటన్‌ను చూసి వచ్చిన తర్వాత ఇక్కడి పాలనపై తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు.
రాష్ట్రంలో వ్యక్తుల పాలన నడుస్తోందా అని ఆయన మండిపడ్డారు. మంచి చేయనప్పుడు ఇది మంచి కాదని, పద్ధతి మార్చుకోవాలని తాను సూచిస్తానని అన్నారు. మంచిని గుర్తించి మంచి చేయాలనే వ్యక్తిత్వం తనదన్నారు. తనను ఎందుకు డిస్మిస్ చేశారో ఇంకా వివరాలు తెలియదన్నారు. రాజీవ్ యువకిరణాలు ప్రారంభోత్సవ సమయంలో కిరణ్ తనను ఆవేదనకు గురి చేశారన్నారు. సిఎం కార్యాలయం నుండి తనకు పిలుపు రాలేదన్నారు. తనను గచ్చిబౌలి స్టేడియంలో కిరణ్ రిసీవ్ చేసుకున్న తీరు సరిగా లేదన్నారు.
ఏ శాఖ ఇచ్చినా పని చేస్తానని గతంలోనే చెప్పానని, శాఖలో కోత పెట్టినందుకు గతంలోనే రాజీనామా చేశానని, ఇలాంటి పరిస్థితుల్లో తనను ఎలా బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. తాను ఇందిర, రాజీవ్ హయాం నుండి కాంగ్రెసులో పని చేశానన్నారు. తాను ఆత్మగౌరవం కలిగిన వ్యక్తినని, ఎక్కడా రాజీపడనన్నారు. తాను గతంలో సోనియా గాంధీకి లేఖ రాశానని, దానిపై ఆమె పిలిచి అడిగితే పార్టీ, ప్రభుత్వ తీరుపై చెప్పానని, ఎవరి పైన ఫిర్యాదు చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications