Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పాట్‌ఫిక్సింగ్: శ్రీశాంత్‌తో డేటింగ్, చిక్కుల్లో నటి సంజన?

Sanjana -Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన పేసర్ శ్రీశాంత్‌కు సన్నిహితురాలైన ప్రముఖ కన్నడ నటి సంజన అర్చనను పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. శ్రీకి ఆప్తురాలు కావడంతో ఆమెను ప్రశ్నించాలని ముంబై పోలీసులు భావిస్తున్నారు. కన్నడ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేసిన బెంగళూరుకు చెందిన సంజనకు శ్రీశాంత్‌తో చాలాకాలంగా పరిచయం ఉంది.

సంజనతో మరో నటిని కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. ముంబై పోలీసులు ప్రాథమికంగా సంజన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను విచారించేందుకు త్వరలో సమన్లు పంపే అవకాశముందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐపిఎల్‌లో మ్యాచ్ అనంతరం జరిగే పార్టీలకు సంజన తరుచూ హాజరవుతుండేదని చెబుతున్నారు.

2009లో గోవా డిస్కోథెక్‌లో శ్రీశాంత్, సంజన డ్యాన్స్ చేస్తూ కెమెరాలకు చిక్కడంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ వార్తలను సంజన వెంటనే ఖండించింది. ఇప్పుడు శ్రీశాంత్‌తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆమెను పోలీసులు విచారించాలని భావిస్తుండటంతో చిక్కుల్లో పడినట్లయింది. ఆమె శ్రీతో డేటింగ్ చేసిందని కూడా అనుమానిస్తున్నారు.

మరో బెయిల్ పిటిషన్

స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్ శ్రీశాంత్‌కు మంగళవారం కోర్టు బెయిల్ నిరాకరించింది. అతని జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూన్ 18వ తేదీ వరకు పొడిగించింది. మంగళవారంతో అతని జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగిసింది. దీంతో మరోసారి కోర్టు అతని జ్యుడిషియల్ కస్టడీని పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిర్ నిరాకరించడంతో శ్రీశాంత్ వెంటనే మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+