నితీష్‌ను చూసి ముఖం చాటేసిన నరేంద్ర మోడీ

మోడీ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి, బిజెపి నేత రమణ్ సింగ్‌తో మాట్లాడారు. అది చూసి నరేంద్ర మోడీ చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయారు. నితీష్ కుమార్‌తో నరేంద్ర మోడీకి గత కొద్ది కాలంగా పడడం లేదు.
బిజెపి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ నరేంద్ర మోడీ పేరును వ్యతిరేకిస్తున్నారు. నరేంద్ర మోడీకి బదులు సెక్యులర్ ఇమేజ్ ఉన్న నాయకుడు ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీష్ కుమార్ అన్నారు. బిజెపి, జెడియు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలు. పైగా, బీహార్‌లో రెండు పార్టీలు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.
నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడియు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తోంది. నితీష్ కుమార్ కూడా నరేంద్ర మోడీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డుమ్మా కొట్టారు.












Click it and Unblock the Notifications