తీయన్మాన్ స్క్వేర్: ఆ ట్యాంక్ మ్యాన్ ఏమయ్యాడు?

బీజింగ్: బీజింగ్ తీయన్మాన్ స్క్వేర్‌లో చైనా సైన్యం 1989లో వేల మందిని కాకపోతే, వందల మందిని చంపి ఉంటుంది. నిరసనకారులపై అప్పట్లో చైనా సైన్యం విరుచుకుపడింది. అయితే, ఆ మారణకాండ జరిగిన మర్నాడు తియన్మాన్ స్క్వేర్‌లో తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు కదులుతున్న ట్యాంక్‌ల ముందుకు వచ్చాడు.

సంఘటన జరిగిన ఇరవై నాలుగేళ్లు గడిచాయి. అయినా ఆ వ్యక్తి ఆచూకీ లేదు. అతను ఎక్కడున్నాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అతన్ని ట్యాంక్ మ్యాన్‌గా పిలుస్తున్నారు. ఆ సంఘటన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అతనికి నివాళులు అర్పిస్తున్నారు.

ట్యాంక్స్ మార్గాన్ని ఆ వ్యక్తి అడ్డుకున్నాడు. మొదటి ట్యాంక్‌పైకి ఎక్కి, సైనికులతో మాట్లాడాడు. ట్యాంక్ పై నుంచి కిందికి దిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని పక్కకు లాగారు. ఈ వివాదం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, అవినీతికి వ్యతిరేకంగా అప్పుడు జరిగిన ఉద్యమంలో మరుపురాని సంఘటనగా మిగిలిపోయింది.

Tank Man

ఇప్పటికీ అతను ఎక్కడున్నాడనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. తిరుగుబాటును అణచేయడానికి వేలాది మంది చైనీయులను అరెస్టు చేసి, జీవింతాంతం జైలులో నిర్బంధించారు. కొంత మందిని ఉరి తీశారు. వారిలో ట్యాంక్ మ్యాన్ ఉన్నాడా, లేడా అనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అతను తైవాన్‌కు పారిపోయి ఉంటాడని అతని మిత్రుడు చెప్పినట్లు హాంగ్‌కాంగ్ ప్రొఫెసర్ ఒకతను చెప్పినట్లు ఓ నివేదిక తెలియజేస్తోంది. అయితే, తన సాధారణ జీవితంలోకి అతను వెళ్లిపోయాడనే ప్రచారం కూడా ఉంది. అతను దేశం విడిచి వెళ్లిపోయి ఉంటే స్వేచ్ఛగా మాట్లాడి ఉండేవాడని కెనడా జర్నలిస్టు జాన్ వాంగ్ అంటున్నారు. జాన్ వాంగ్ ఆ వివాదాన్ని ప్రత్యక్షంగా చూశారు.

అధికారులకు అతను చిక్కి ఉంటే ప్రజలకు చూపించి ఉండేవారని కూడా ఆమె అన్నారు. చైనాలోని జీవనం సాగిస్తూ ఉండి ఉంటాడని ఆమె భావిస్తున్నారు. అతనికి ఏం జరిగిందనేది తనకు తెలియదని పార్టీ అధికారిక డాక్యుమెంటు అంటోందని చైనాలోని మానవ హక్కులు, ప్రజాతంత్ర ఉద్యమ సమాచార కేంద్రం అంటోంది. ఆ వ్యక్తి అరెస్టయ్యాడా, లేదా చెప్పలేనని చైనా మాజీ నేత జియాంగ్ జెమిన్ బార్బరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1990లో చెప్పారు.

ఆ వ్యక్తి బీజింగ్‌లోని సాధారణ పౌరుడి జీవితంలోకి ప్రవేశించి ఉంటాడని అంటున్నారు. సిక్స్ లేన్ ఎవెన్యూ మీదుగా ఓ సంచీ పట్టుకుని వెళ్తుండగా ట్యాంక్‌లను చూసి, ఏదో చేయాలనే భావనతో అలా చేశాడని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+