జగన్ ఒకేషాప్‌పై హామీ, ఈనాడులోనే బాబు చరిత్ర: శోభా

అసలు వాటిని ప్రపంచానికి పరిచయం చేసిందే ఆయన అన్నారు. టిడిపి పరిపాలనలో బెల్ట్ షాపులే లేవని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మద్య నియంత్రణ కమిటీ సమావేశంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని తెలిపారు. ఆయన హయాంలో 40 వేల బెల్ట్ షాపులు ఉన్నట్లు 2003 సంవత్సరంలో ఈనాడు పత్రికే రాసిందని ఆమె గుర్తు చేస్తూ ఆ ప్రతులను విడుదల చేశారు. ముఖ్యమంత్రి అయితే రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దు పైనే అని బాబు చెప్పడం ప్రజలను మోసగించడమేనని చెప్పారు.
బెల్ట్ షాపులేమైనా అధికారికమైనవా సంతకాలతో రద్దు చేయడానికి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తికి అనధికారికంగా ఏర్పడిన బెల్ట్ షాపులను సంతకాలతో రద్దు చేయలేరనే విషయం తెలియదా అని అన్నారు. చంద్రబాబు అధికారానికి దూరమై సంతకాలు చేసి చాలా కాలమైందని, అందుకే ఇప్పుడు ప్రతి దానికీ సంతకం చేస్తానంటూ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ ములాఖత్‌లపై....
ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కోలేమనే భయంతోనే టిడిపి ఆయన జైలు ములాఖత్‌లపై దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. జగన్ కేవలం విచారణలో ఉన్న ఖైదీ మాత్రమేనని, నిబంధనలకు లోబడే ఆయనకు ములాఖత్‌లు లభిస్తున్నాయని, ఈ విషయమై జైలు అధికారులు పదే పదే చెబుతున్నా, టిడిపి నేతలు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications