వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రాష్ట్రాల్లో 2014 ఎన్నికలు, సిఎం పదవొద్దు: జానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలునని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం అన్నారు. 2014 సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాలలో జరుగుతాయని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. బంగారు తల్లి పథకం పైన మంత్రివర్గంలో చర్చిస్తామని అన్నారు. తాను తెలంగాణ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అధిష్టానం తల్చుకుంటే తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యమేనన్నారు. ఏకాభిప్రాయం రాకున్న విచక్షణాధికారంతో ఇవ్వవచ్చునని చెప్పారు.

15లోపు ఎన్నికల సంఘానికి

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వివరాలను ఈ నెల 12వతేది నుంచి 15వ తేదిలోపు ఎన్నికల సంఘానికి ఇస్తామని జానారెడ్డి చెప్పారు.

సిఎంకు వ్యతిరేకంగా ఎవరు లేరు: దానం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మంత్రివర్గంలో ఎవరు లేరని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రిని చేసింది కిరణే అని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ పైన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఆజాద్ వల్లే అతను శాసనమండలి సభ్యుడు అయ్యారని, అది గుర్తుంచుకోవాలని సూచించారు. మంత్రివర్గం నుండి డిఎల్ రవీంద్రా రెడ్డి తొలగింపు తమ పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే జరిగిందన్నారు.

English summary
Minister Jana Reddy hoped that Telangana will come before 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X