జయలలిత పార్టీలో చేరిన నటి అనురాధ, ఆమని భర్త

Actress Anuradha joins in AIADMK
చెన్నై: నిన్నటి తరం ప్రముఖ నటి ఎంకె అనురాధ బుధవారం అన్నాడిఎంకె పార్టీలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సమక్షంలో ఆమె చెన్నైలోని అన్నాడిఎంకె ప్రధాన కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనురాధతో పాటు ప్రముఖ చెఫ్ దామోదరన్, ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జయలలిత సమక్షంలో అన్నాడిఎంకె పార్టీలో చేరారు.

అనూరాధ వెంట ఆమె కుమార్తె అభినయశ్రీ కూడా వున్నారు. సినీ నిర్మాత, డిపిఐ ఉప ప్రధాన కార్యదర్శి, నటి ఆమని భర్త ఖాజామొయినుద్దీన్ కూడా అన్నాడిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

డిఎండికె ఎమ్మెల్యేల పిటిషన్ డిస్మిస్

కొద్ది రోజుల క్రితం విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె పార్టీ ఎమ్మెల్యేలను ఈ సంవత్సరం ఆఖరు వరకు స్పీకర్ డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై డిస్మిస్‌కు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తమ డిస్మిస్‌ను ఎత్తివేసే విధంగా ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు. డిస్మిస్‌ను ఎత్తివేయాలన్న వారి పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+