గృహ నిర్బంధం: కోలుకుంటున్న హేమవతి, తండ్రి సైకో

హేమవతి ఆరోగ్యానికి తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆమెకు సమయానికి సరైన ఆహారం అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. హేమవతికి ఎలాంటి న్యూరాలజికల్ సమస్య లేదని వారు అన్నారు. కాగా హేమవతి తండ్రి పైన ఆమె స్నేహితురాళ్లు, చుట్టు పక్కల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హేమవతిని చూడక పదేళ్లయినట్లుగా అనిపిస్తోందని, తాము హేమవతి గురించి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగినప్పుడు తన కూతురు ఆరోగ్యం బాగా లేదని చెప్పేవారని ఓ స్నేహితురాలు చెప్పారు. హేమవతి ఓ యువకుడితో ప్రేమలో పడిందనే వార్తల్లో ఎలాంటి నిజం తెలిపారు. ప్రస్తుత హేమవతి పరిస్థితికి ఆమె తండ్రే బాధ్యుడన్నారు. హేమవతి తండ్రి చుట్టుపక్కల వారితో నిత్యం గొడవ పడుతుంటాడని, ఆయన ఓ సైకో అని ఆరోపించారు.
హేమవతి తండ్రి తమతో ఎప్పుడు బాగా ఉండేవాడు కాదని మరో వ్యక్తి చెప్పారు. తాను హేమవతి గురించి అడినప్పుడు.. నీకేం అవసరమని, తనను మధ్యలోకి రావొద్దని హెచ్చరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications