కుంద్రా చాలా మంచోడు, బుకీలను పట్టుకోండి: విందూ

పోలీసులు తననెందుకు ఇరికిస్తారని, తాను ఏ నేరమూ చేయలేదని, తాను ఏ తప్పూ చేయలేదని, వారికి నిజం తెలియాల్సి ఉందని, వారికి నిజం తెలిస్తే తనను వదిలేస్తారని విందూ దారాసింగ్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా గురించి అడిగినప్పుడు అతను మంచి మనిషి అని, తనకు అతను బాగా తెలుసునని విందూ జవాబిచ్చాడు.
తన జట్టు ఆడుతున్నప్పుడు తన జట్టు గెలుస్తుందని ఎప్పుడూ అనడని ఆయన చెప్పాడు. భారతదేశంలో కోట్లాది మంది బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని, దేశంలో బెట్టింగ్‌ను ఆపాలంటే బుకీలను పట్టుకోవాలని, బెట్టింగ్ కట్టేవారిని కాదని ఆయన అన్నాడు.
ఐపియస్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగు కుంభకోణంలో విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్ అరెస్టయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా మంగళవారంనాడు బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications