జయకంటే బెటర్: విజయకాంత్, 'అమ్మ'లో కరుణ బర్త్‌డే

జయలలితపై మండిపడ్డారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రభుత్వ విధానాల పైన ఎన్నోసార్లు వ్యతిరేకంగా మాట్లాడామని, అయినప్పటికి ఆయన ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. కానీ, ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నందుకు జయలలిత మాత్రం తమపై పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అమ్మ క్యాంటీన్‌లో కరుణ పుట్టిన రోజు వేడుక
ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్యాంటీన్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమ్మ ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్‌లలో కరుణానిధి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. రెండు రోజుల క్రితం కరుణ తన తొంభయ్యవ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిఎంకె కార్యకర్తలు ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వెల్లూరులో ఓ డిఎండికె కార్యకర్త కరుణ పుట్టిన రోజు వేడుకలను ఈ క్యాంటీన్‌లో చేశారు. ఈ క్యాంటీన్‌లలో తమిళనాడు ప్రభుత్వం సరసమైన ధరలకే ఇడ్లీ, టీ వంటి వాటిని అందిస్తోంది.












Click it and Unblock the Notifications